Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయం: సీపీ సాయిచైతన్య

వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. మంగళవారం సీపీ కార్యాలయంలో ఆరో టౌన్​ పోలీస్​ సిబ్బందిని సన్మానించారు.

Nizamabad Police | బోధన్​ రోడ్డుపై భారీగా నిలిచిన నీళ్లు..

నగరంలోని ఆరో టౌన్​ పరిధిలోని బోధన్​ రోడ్​లో అల్ రెహమాన్ హోటల్ నుండి నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు వెళ్లే దారిలో భారీ వర్షం కారణంగా నీళ్లు నిలిచిపోయాయి. బోధన్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఆరో టౌన్​ ఎస్సై సందీప్ ఆదేశాల మేరకు ఏఎస్సై జక్రయ్య, హెడ్ కానిస్టేబుల్​ సాయిబాబా హుటాహుటిన స్పందించారు. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లారు.

డ్రైనేజీల్లో చెత్తాచెదారం నిండిపోయి రోడ్డుపై భారీ ఎత్తున నీళ్లు నిలిచిపోవడాన్ని గమనించిన పోలీసులు వెంటనే జేసీబీలు తెప్పించి చెత్తను తొలగింపజేశారు. పనులు పూర్యయ్యేవరకు అక్కడే ఉంచి పర్యవేక్షించారు. దీంతో వీరిద్దరిని సీపీ సాయిచైతన్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్​ యాదవ్​, స్పెషల్​ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, ఆరో టౌన్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Rain Alert | సెల్ఫీల కోసం ప్రాణాలను తీసుకోవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *