అక్షరటుడే, ఇందూరు: Special Intensive Revision | ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ (DCC Nizamabad City) అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలో ‘సర్’ (SIR) ప్రక్రియను అర్బన్ కో–ఆర్డినేటర్ ఆకుల లలితో కలిసి పరిశీలించారు.
Special Intensive Revision | బీఎల్ఏలకు సహకరించాలి..
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇళ్లకు వచ్చే బీఎల్ఏలకు సహకరింంచాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలాం నింపాలనే విషయంపై సందేహాలను నివృత్తి చేసుకోవాలని( Election Awareness) సూచించారు. ఫారంపై తప్పనిసరిగా ఫొటో అతికించాలని వివరాలను సరిగ్గా రాయాలన్నారు. ఫారాలు నింపడంలో సమస్యలుంటే.. అర్బన్‌లోని మున్సిపల్ జోన్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. సహాయ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు సలహా సూచనలు అందిస్తూ బీఎల్వోలు సహకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మనోహర్, రాజేంద్ర ప్రసాద్, రాజు ఆకుల, రాజేష్, శంకర్, పోల ఉష, స్వప్న, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
