అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Activists Recognition | తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచితంగా గౌరవించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే. కేశవరావు నేతృత్వంలో గురువారం “తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ” ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ఎం. కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Telangana Activists Recognition | పారదర్శకంగా అర్హుల జాబితా..
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని కమిటీ అధికారులను ఆదేశించింది. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ తొలి , మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న వారు, అలాగే క్షేత్రస్థాయి (గ్రాస్ రూట్) ఉద్యమకారుల పూర్తి వివరాలను సేకరించాలని సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ఒక పక్కా కార్యాచరణను (Action Plan) రూపొందించి, నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.

Telangana Activists Recognition | రాజకీయాలకు అతీతంగా గుర్తింపు: మంత్రి పొన్నం
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరినీ ఈ ప్రజా ప్రభుత్వం గౌరవిస్తుంది. ఉద్యమకారుల గుర్తింపు, వారికి కల్పించాల్సిన సదుపాయాలపై రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం” అని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొన్నారు. కేవలం పార్టీలకే పరిమితం కాకుండా.. విద్యార్థి జేఏసీలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కవులు, కళాకారులను కూడా సంప్రదించి సమగ్రమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారందరిని గుర్తించి, ప్రభుత్వం సముచితంగా గౌరవించాలని ప్రభుత్వ లక్ష్యమని పొన్నం పేర్కొన్నారు
అమరవీరుల… pic.twitter.com/DBx97scxOU
— BIG TV Breaking News (@bigtvtelugu) June 4, 2026
ఇది కూడా చదవండి: Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి..
