Mallareddy BRS | బీఆర్‌ఎస్‌లోనే ఉంటా .. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి

తాను ఏ పార్టీలోకీ మారడం లేదని, చివరి వరకు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mallareddy BRS | తాను ఏ పార్టీలోకీ మారడం లేదని, చివరి వరకు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. బోయిన్‌పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలకు తెరదించారు.

Mallareddy BRS | రక్తపు లేఖపై ఆవేదన..

తాను పార్టీ మారుతున్నాననే వార్తలు విని ఒక బీఆర్‌ఎస్ కార్యకర్త తనకు రక్తంతో లేఖ రాయడంపై మల్లారెడ్డి స్పందించారు. ఆ లేఖ చూసి తనకు చాలా బాధ అనిపించిందన్నారు. అయితే ఆ ఉత్తరంలో చిరునామా రాయలేదని, ఆ కార్యకర్త ఎవరో కనుక్కుని తప్పకుండా అతని ఇంటికి వెళ్లి కలుస్తానని హామీ ఇచ్చారు.

Mallareddy BRS | కేటీఆర్‌ సీఎం కావాలి..

కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైనా కేటీఆర్ సమర్థవంతంగా పోరాడుతున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Paper Leak Punishment | పేపర్ లీక్​కు పాల్పడితే పదేళ్ల జైలు.. కేంద్రం కీలక నిర్ణయం !

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *