అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Weather | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం వేళ తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో రుతుపవనాల సీజన్ ముగిసింది. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తెలంగాణలో లోటు వర్షపాతం నమోదు అయింది. అయితే ఇటీవల ఎండ తీవ్రత పెరిగింది. రానున్న 5 రోజులు సైతం ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. తూర్పు, దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35-36°C వరకు చేరవచ్చు.
Telangana Weather | మళ్లీ వర్షాలు
రాష్ట్రంలో అక్టోబర్ 2 తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే పడుతాయి. వీటి ప్రభావం ఎక్కువగా ఉండదు. ఎండల తీవ్రత మాత్రం పెరగనుంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయడం లేదు. మరోవైపు వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వకపోవడంతో బోర్ల ద్వారా పొలాలకు నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో నీటి, విద్యుత్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లు రైతులు జాగ్రత్తగా ఉండాలి.
దీనిని కూడా చదవండి : Rajiv Yuva Vikasam | నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభం