నిజామాబాద్Paddy Procurement Delay | నెలలుగా కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు.. ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టిన...

Paddy Procurement Delay | నెలలుగా కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు.. ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టిన రైతు

అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మగ్గిపోతుండడంతో రాజమ్మ తండాలో ఓ రైతు తన పంటకు నిప్పు పెట్టాడు.

అక్షరటుడే, కామారెడ్డి: Paddy Procurement Delay | అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మగ్గిపోతుండడంతో విసుగు చెందిన కొందరు రైతులు ధాన్యానికి నిప్పు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం రామారెడ్డి (ramareddy) మండలం ఇసన్నపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ఓ రైతు ధాన్యానికి నిప్పు పెట్టిన ఘటన మర్చిపోకముందే మంగళవారం రాత్రి మళ్లీ అలాంటిదే మరో ఘటన జరిగింది.

Paddy Procurement Delay | రామారెడ్డి మండలం రాజమ్మ తండాలో..

రామారెడ్డి మండలం రాజమ్మ తండాకు చెందిన రైతు ల్యాగల నరేష్ వరి ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. కాంటా అయినప్పటికీ రైస్ మిల్లులకు ధాన్యం తరలించకపోవడంతో ఆగ్రహంలో నిప్పంటించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి ఆర్డీవో గిరి (Kamareddy RDO Giri) వెంటనే కొనుగోలు కేంద్రానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైతులు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి చాలా రోజులవుతున్నా కాంటాలు సరిగా చేయడం లేదని, కాంటా అయిన ధాన్యాన్ని కూడా రైస్​మిల్లులకు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆర్డీవో గిరి, వరి ధాన్యం కాంటాలు పూర్తయ్యేలా, కాంటా అయిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Cancer Drug Smuggling|క్యాన్సర్ మందుల అక్రమ రవాణాపై ఢిల్లీ హైకోర్టు ఫైర్.. కేంద్రం, CDSCO లకు కోర్టు నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...

Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు...