అక్షరటుడే, కోటగిరి: Medical Shops Bandh | ఉమ్మడి కోటగిరి మండలంలో మెడికల్ షాప్ల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆన్లైన్లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీవో.817ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (Organization of Chemists and Druggists) బంద్కు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా నిర్వాహకులు మండలంలోని మెడికల్ దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Medical Shops Bandh | మెడికల్ షాప్లపై తీవ్ర ప్రభావం..
ఈ సందర్భంగా కోటగిరి (kotagiri), పోతంగల్ (Pothangal) మండలాల మెడికల్ షాపుల అసోసియేషన్ అధ్యక్షుడు బర్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి సితాలే విజయ్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా మందులు (online medicine sales) విక్రయాలు చేయడం, అధికంగా డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా నాసిరకమైన మందులు మార్కెట్లో చలామణి అవుతున్నాయన్నారు. అలాగే చిన్న మెడికల్ షాప్లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ల బంద్ పాటిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో 817ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగ భూషణం గౌడ్, దేవుడి సాయిలు, సాయాగౌడ్, నరేందర్, లింగారాం, గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: UP Encounters | అక్కడ రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు కామన్.. నేరస్తుల గుండెల్లో వణుకుపుట్టించిన యోగి


