Negligent Driving Accident | నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..

shashi kiran Mottala

అక్షరటుడే,కోటగిరి: Negligent Driving Accident | డివైడర్​ను కారు ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కోటగిరి (kotagiri) మండలం ఎత్తొండ క్యాంప్​లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

Negligent Driving Accident | అజాగ్రత్తగా కారు నడపడంతో..

ఎస్సై సునీల్​ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన యువకుడు ముత్తిపేట సాత్విక్​ (19) మాశెట్టి ప్రతాప్ అనే వ్యక్తితో కారులో ఎత్తొండ వైపు వెళ్తున్నాడు. అయితే ఎత్తొండ క్యాంప్​ (Etthonda Camp) అంబేడ్కర్​ విగ్రహం వద్దకు రాగానే డ్రైవర్​ ప్రతాప్​ అజాగ్రత్తగా కారు నడపడంతో డివైడర్​ను (car crash) ఢీకొట్టింది. ఈ ఘటనలో సాత్విక్​ తల, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని బోధన్​లోని (bodhan) ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాత్విక్​ గురువారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్​ తెలిపారు.

ఇది కూడా చదవండి: BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో కలకలం.. కార్పొరేటర్​ టికెట్​ పేరిట డబ్బులు వసూలు..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *