నిజామాబాద్Online Medicine Sales | ఆన్​లైన్​లో మందుల విక్రయాలతో ప్రజారోగ్యానికి ముప్పు

Online Medicine Sales | ఆన్​లైన్​లో మందుల విక్రయాలతో ప్రజారోగ్యానికి ముప్పు

ఆన్​లైన్​లో మందుల విక్రయాలతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని కామారెడ్డి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అన్ని మెడికల్ షాప్​లు మూసివేసి యజమానులు నిరసన తెలిపారు.

అక్షరటుడే, కామారెడ్డి: Online Medicine Sales | ఆన్​లైన్​లో మందుల విక్రయాలతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని కామారెడ్డి (Kamareddy) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ (Chemists and Druggists Association) ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అన్ని మెడికల్ షాప్​లు మూసివేసి యజమానులు నిరసన తెలిపారు. అనంతరం బుధవారం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో మీడియాతో మాట్లాడారు.

Online Medicine Sales | దుకాణాల మూసివేత ఇష్టం లేకపోయినా..

మందుల దుకాణాలు మూసివేయాలని తమకు ఇష్టం లేదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విధానం వల్ల మందుల పంపిణీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంటింటికీ మందులు చేరుతున్నాయని, వినియోగదారులు ఇష్టం వచ్చినట్లు మందులు వాడేస్తున్నారని పేర్కొన్నారు. మందులను కేవలం లైసెన్స్ ఉన్న మందుల దుకాణాల ద్వారానే విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Online Medicine Sales | ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు..

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాన్ని అరికట్టాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా మందులు అమ్మడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, తప్పుడు వాడకం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం కామారెడ్డికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా కెమిస్ట్ అసోసియేషన్లు ఆన్‌లైన్ ఫార్మసీలపై నియంత్రణ కోరుతూ చేస్తున్న ఆందోళనలో భాగమని తెలిపారు. కార్యక్రమంలో రిటైలర్ కామారెడ్డి మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఆర్​ కేశవ్, సెక్రెటరీ టి.వంశీ, కోశాధికారి దామోదర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేష్, జాయింట్ సెక్రెటరీ మారుతి, సెక్రెటరీ ఏఆర్ ప్రభాకర్, హోల్​సేల్​ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గజవాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi Remarks| మోదీ ఒక దేశద్రోహి.. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారు: రాహుల్ గాంధీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...

Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు...