Mysore Dasara Festival | మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్​రెడ్డి

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్​రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mysore Dasara Festival | కర్ణాటకలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.

మైసూరులో ప్రతి యేటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సైతం కర్ణాటక సీఎం డీకే శివకుమార్​ వేడుకలను ప్రారంభించారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్​రెడ్డి, డీకే శివకుమార్​ ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.

Mysore Dasara Festival | అమ్మవారికి ప్రత్యేక పూజలు

మైసూరు రాజభవనం వద్ద నిర్వహించిన ఈ దసరా వేడుకల్లో పాల్గొనడానికి ముందు సీఎం మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంను పలువురు సన్మానించారు.

ఇది కూడా చదవండి : Indian Roller Bird | పాలపిట్టలను రక్షించిన అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *