అక్షరటుడే, వెబ్‌డెస్క్: Justice Aparesh Kumar Singh | తెలంగాణ Telangana హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సు చేసింది.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కేంద్ర న్యాయ శాఖ ఈ సిఫార్సును పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Justice Aparesh Kumar Singh | సుదీర్ఘ న్యాయసేవలు..
జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ న్యాయవాదిగా, హైకోర్టు న్యాయమూర్తిగా, అనంతరం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్నో కీలక తీర్పులను వెలువరించారు. న్యాయవ్యవస్థలో ఆయన అందించిన విశేష సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
Anti Drugs Awareness Video | ఉపాధ్యాయుడి సామాజిక చైతన్యం..”మత్తు కాదు.. మేలుకో!”లఘు చిత్రం రూపకల్పన!
తెలంగాణ హైకోర్టు సీజేగా సేవలందిస్తున్న ఆయన సుప్రీంకోర్టుకు ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర న్యాయవాదులు, పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.