Revanth Reddy BJP Criticism | మోరీలు తీయడానికి మోదీ వస్తారా.. సీఎం సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై సీఎం రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ మోరీలో మురికి తీయడానికి ప్రధాని మోదీ వస్తారా అని ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy BJP Criticism | కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ మోరీలో మురికి తీయడానికి ప్రధాని మోదీ (PM Modi) వస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ మంచి నాయకులు ఉండాలన్నారు. గ్రేటర్‌ చుట్టూ నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. కేంద్రం నుంచి నిధులు తేవడం లేదని విమర్శించారు.

హైదరాబాద్​ నగరంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ మియాపూర్‌లో రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.530 కోట్లతో మియాపూర్ ఫ్లైఓవర్ ఇంటర్‌సెక్షన్, బాచుపల్లి ఫ్లైఓవర్​ను ప్రారంభించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.

Revanth Reddy BJP Criticism | అనుమతులు తేవడం లేదు

గ్రేటర్‌ చుట్టూ నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని సీఎం అన్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను ప్రజలు గెలిపించారని తెలిపారు. వారు మెట్రో ఫేజ్​–2, మూసీ ప్రక్షాళనలు అనుమతులు తీసుకురావడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర సీఎం తెలంగాణతో చర్చలకు రాకుండా అడ్డుకుంటున్నది బీజేపీనే అని ఆరోపించారు. సబర్మతి అద్భుతం అన్న మీరు మూసీ ప్రక్షాళన చేయరా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి లడాయిలేంటో, తెలివితేటలేంటో అందరికీ తెలుసన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ, ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా అని ప్రశ్నించారు.

Revanth Reddy BJP Criticism | ఆ దుస్థితి రావద్దు

గాజుల రామారంలో 100 ఎకరాల్లో బస్టాండ్ (Gajularamaram Bus Stand)​ నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఆర్టీసీకి స్థలం కేటాయించామని, మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటని సీఎం అన్నారు. అయితే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్లే నేడు ఢిల్లీలో స్కూళ్లు, పీఎంఓ ఆఫీస్ కూడా బంద్ అయ్యే దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు.

Revanth Reddy BJP Criticism | ముంబై మునుగుతుంది

దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్‌ కష్టాలు ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. వర్షమొస్తే ముంబై నీట మునుగుతుందని.. ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందన్నారు. స్లమ్స్‌లో సదుపాయాలు లేక ముంబైలో నివసించే పరిస్థితి లేదన్నారు. బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య వల్ల కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌కు ఎన్నిగంటలకు చేరుకుంటామో కూడా చెప్పలేమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో అలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి : Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *