Kavitha BC Census | బీసీ కులాల జనాభాను తక్కువ చూపే కుట్ర : కవిత

బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha BC Census | బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’’ సదస్సులో ఆమె మాట్లాడారు.

కేంద్రం చేసే జనగణన (Census)లో బీసీ ఉప కులాలను కూడా కలిపి లెక్కించాలని కవిత డిమాండ్​ చేశారు. కుల గణనకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని, కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లైనా కూడా కుల వివక్ష తప్పటం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, స్పీకర్ సహా ఎంతో మంది పెద్దస్థానాల్లో ఉన్న వాళ్లు కుల వివక్షకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. మనకు తెలియకుండా దేశంలో లక్షలాది మంది రోజు వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే కుల వివక్ష పోతుందని తెలిపారు.

Kavitha BC Census | జఠిలమైన సమస్య

కులం అనేది చాలా కోణాలతో కూడిన జఠిలమైన సమస్య అని కవిత అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి చాలా పరిష్కారాలు అవసరం అన్నారు. రాజ్యాధికారంలో అన్ని కులాలను భాగస్వామ్యం చేస్తూనే వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచించారు. ఒక మనిషితో కలిసి కూర్చుంటే, ముట్టుకుంటే ఏదో జరుగుతుందనే దారుణమైన ఆలోచన విధానం మన డీఎన్ఏలోనే నిండిపోయిందని ఆమె అన్నారు.

Kavitha BC Census | జనాభా తెలిస్తే..

ఏ కులం ఎంత జనాభా ఉందో తెలియాల్సి అవసరం ఉందని కవిత అన్నారు. కేంద్రం చేసే జనాభా గణనలో కులాల జాబితాలో ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని డిమాండ్​ చేశారు. కేంద్రం జనాభా గణనలో బీసీ అనే కాలం మాత్రమే పెడతామని చెబుతోందని, అలా కాకుండా ఉపకులాల కాలం కూడా ఉండాలని కోరారు. ఉపకులాలను కూడా లెక్కించకపోతే ఆయా కులాల జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు చూపే పరిస్థితి వస్తుందన్నారు. కులాల సంఖ్యను తక్కువ చేసి బీసీలు ఐక్యంగా పోరాడకుండా పొలిటికల్ స్ట్రాటజీ చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

 

దీనిని కూడా చదవండి : ACB Trap Case | ఏసీబీకి చిక్కిన హాస్టల్​ వార్డెన్​

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *