ACB Trap Case | ఏసీబీకి చిక్కిన హాస్టల్​ వార్డెన్​

కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ ఇన్​ఛార్జీ వార్డెన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap Case | కొత్తగూడెం జిల్లా చర్ల  మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర హాస్టల్ ఇన్​ఛార్జీ వార్డెన్ (Hostel Warden)​, రికార్డు అసిస్టెంట్​ బుక్య వలుసింహ ఏసీబీకి చిక్కాడు. రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

పాల్వంచ హాస్టల్​ వార్డెన్​, రికార్డు అసిస్టెంట్​ అయిన బుక్య వలుసింహ సత్యనారాయణ పురం హాస్టల్ ఇన్​ఛార్జీ వార్డెన్​గా కొనసాగుతున్నారు. హాస్టల్​లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆగస్టులో 6 రోజులు విధులకు హాజరు కాలేదు. దానిని అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా, తద్వారా భవిష్యత్తులో ఆమె ఉద్యోగంలో ప్రతికూల పరిణామాలను నివారించడానికి, జీతం బిల్లుల తయారీలో ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు వార్డెన్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు. బేరసారాల అనంతరం ఆ మొత్తాన్ని రూ.14 వేలకు తగ్గించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు నుంచి శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. వార్డెన్​ వలుసింహాను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ACB Trap Case | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. రూ.500 లంచం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. బహుమతుల రూపంలో కూడా ఎలాంటి వస్తువులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. ఏసీబీ టోల్​ఫ్రీ నంబర్​ 1064, వెబ్​సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Danam Nagender Disqualification | దానం నాగేందర్‌కు హైకోర్టులో బిగ్ షాక్.. అనర్హత వేటు వేస్తూ తీర్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *