అక్షరటుడే, వెబ్డెస్క్ : paddy procurement | రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల కింద కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క గింజ కూడా కొన్న పాపాన పోలేదని విమర్శించారు. సిరిసిల్ల (Siricilla) జిల్లాలోని బద్దెనపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
రైస్ మిల్లులు కేటాయించపోతే.. ధాన్యాన్ని ఎవరు కొనాలి? ఎలా తూకం వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కొనడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వడం లేదన్నారు. సిరిసిల్లలో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

paddy procurement | వర్షాలకు తడుస్తున్న ధాన్యం
అకాల వర్షం పడి ధాన్యం తడిసి పోతుందని కేటీఆర్ అన్నారు. తమది రైతు ప్రభుత్వం అని రాహుల్ గాంధీ చెప్తున్నారని, కానీ ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత దరిద్రపు పాలన లేదన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఆ తరవాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
దీనిని కూడా చదవండి : Kavitha Criticizes KCR | అవినీతి పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్న కేసీఆర్ : కవిత

