KTR Congress Remarks | కాంగ్రెస్​ పని అయిపోయింది : కేటీఆర్​

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Congress Remarks | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ అన్నారు. ఇదే అంశం ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి సగం పదవీ కాలం అయిన సందర్భంగా.. తన నాయకత్వంపై సర్వే చేయించుకున్నట్లు తెలిపారు. అందులో ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తం అయిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్​ఎస్ 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

KTR Congress Remarks | డైవర్షన్​ పాలిటిక్స్​

పాలన వైఫల్యాలను ముఖ్యంగా కప్పిపుచ్చుకునేందుకు సీఎం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారని కేటీఆర్​ అన్నారు. ఇచ్చిన గ్యారంటీల అమలు, హామీల అమలులో పూర్తిగా విఫలమైనందువల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారన్నారు. దీంతో ప్రజలు మరోసారి బీఆర్​ఎస్​ను కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ లాంటి ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరని చెప్పారు.

KTR Congress Remarks | జారుడు బండపై కాంగ్రెస్​

brs 4

కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందని, ఇక పుంజుకునే అవకాశమే లేదని కేటీఆర్​ విమర్శించారు. ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా, ప్రజలకు మోసం చేయాలని చూసినా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ప్రజామోదం పొందడం అత్యంత కష్టమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం అత్యంత మందకొడిగా సాగుతున్నదని, ముఖ్యంగా ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు (BLOs) సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు ఇవ్వకపోవడంతో మొత్తం ఈ కార్యక్రమం నెమ్మదిగా సాగుతుందన్నారు. హైదరాబాద్ లాంటి అత్యధిక జనసాంద్రత ఉండే మహానగరంలో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన ఫారాల పంపిణీ, ఓటర్ల నమోదు వంటి అంశాలపై సరైన అవగాహన లేకుండానే అధికారులను కేటాయించారన్నారు. ఎస్​ఐఆర్​లో ఒక్క ఓటు కూడా పోకుండా బీఆర్​ఎస్​ నాయకులు చూడాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Telangana Sports Policy | క్రీడల్ని ప్రోత్సహించేందుకు పాలసీ : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *