Telangana Sports Policy | క్రీడల్ని ప్రోత్సహించేందుకు పాలసీ : సీఎం రేవంత్​రెడ్డి

క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకు వచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​లో ఒలిపింక్స్​ నిర్వహించాలన్నది తన కల అని పేర్కొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Sports Policy | క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకు వచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలో యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గురువారం ప్రారంభించారు. స్పోర్ట్స్‌వర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరించారు. పారా అథ్లెట్స్‌ ప్రోగ్రామ్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. వివిధ స్పోర్ట్స్‌ కోర్సులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాఆడుతూ.. యువతే ఈ దేశ సంపద అన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం క్రీడల్లో అత్యంత వెనకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల విధానాలే ఈ దుస్థితికి కారణం అని పేర్కొన్నారు.

Telangana Sports Policy | పీపీపీ విధానంలో..

పీటీ ఉష, నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) వంటివారు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం తెలిపారు. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టామన్నారు. దేశం గర్వించే క్రీడాకారుల్ని, వ్యాపారవేత్తల్ని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశానికి ఇప్పుడు అకాడమీలు, సదుపాయాలు అవసరం అని ఆయన పేర్కొన్నారు.

Telangana Sports Policy | అదే నా కల

revanth reddy 2

గత 20 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టలేదని రేవంత్​రెడ్డి అన్నారు. 1990-2004 మధ్య హైదరాబాద్ చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు ఆతిథ్యం ఇచ్చిందని గుర్తుచేశారు. 2036 ఒలింపిక్స్‌ (Olympics 2036)కు భారత ఆతిథ్యం ఇవ్వనుందని.. దానికి హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించానేది తన కల అన్నారు. స్పోర్ట్స్​ యూనివర్సిటీ అధ్యక్షుడిగా సంజీవ్ గోయెంకా వ్యవహరిస్తారని సీఎం తెలిపారు. డైరెక్టర్లుగా రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, కావ్య మారన్ తదితరులను నియమించామన్నారు. క్రీడా వ్యవహారాల్లో రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వనని పేర్కొన్నారు.

 

దీనిని కూడా చదవండి : Bhageerath Bail | హైకోర్టు కీలక తీర్పు.. బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *