Bhageerath Bail | హైకోర్టు కీలక తీర్పు.. బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhageerath Bail | రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, గురువారం ( జులై 9 ) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Bhageerath Bail | తీర్పులోని కీలక అంశాలు..

ఇరుపక్షాల న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను పరిశీలించిన ధర్మాసనం, భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని నిబంధనలను విధించింది. రూ. 1 లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు పూచీకత్తులు (Sureties) సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

bagirath.1

Bhageerath Bail | పోక్సో చట్టం కింద కేసు నమోదు ..

మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మే 16న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. గతంలో పరీక్షల నిమిత్తం లోయర్ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా, ఆ గడువు ముగిసిన తర్వాత జూన్ 25న ఆయన తిరిగి జైలులో లొంగిపోయారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Bhageerath Bail | కోర్టులో వాదనలు..

బెయిల్ విచారణ సందర్భంగా, కేసులో పోలీసుల దర్యాప్తు దాదాపు పూర్తయిందని, నిందితుడు 49 రోజులకు పైగా జైలులో ఉన్నారని భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మరోవైపు, నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ , బాధితురాలి తరఫు న్యాయవాదులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు, కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పును వెలువరించింది.

 

ఇది కూడా చదవండి:  ABVP Foundation Day | ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *