అక్షరటుడే, ఇందూరు: ABVP Foundation Day | విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ (ABVP) ఎదిగిందని సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పేర్కొన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ABVP Foundation Day | నగరంలో భారీ ర్యాలీ..
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ.. 1949 జూలై 9న ప్రారంభమైన ఏబీవీపీ కేవలం విద్యారంగ సమస్యలపైనే కాకుండా, విద్యార్థుల్లో జాతీయ భావాలు, సమాజంపై బాధ్యతను పెంపొందించడంలో ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ‘జ్ఞానం – శీలం – ఏకత’ అనే నినాదంతో కోట్లాది మంది విద్యార్థులను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేస్తోందని వివరించారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తోందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి మరిన్ని ప్రజాస్వామ్య పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేశారు. కార్యక్రమంలో హిందువు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి, నగర సంఘటన మంత్రి శివ ప్రసాద్, కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జి దుర్గాదాస్ సాయికుమార్, రక్షిత్, బాలకృష్ణ, సన్నీ, స్నేహిత్, చెర్రీ, లక్కీ, దీపన్, రాజకుమార్, దినేష్, రిచిత్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం : సీపీ సాయిచైతన్య