అక్షరటుడే వెబ్‌డెస్క్: Musi River Project | మూసీ నదిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు’ను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
Musi River Project | మొత్తం రూ. 7,345 కోట్లు..
మొదటి దశ పనుల కోసం మొత్తం రూ. 7,345 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (MRDCL) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు సాగనున్నాయి. ఇందులో భాగంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) నుంచి రూ. 4,500 కోట్ల రుణాన్ని సమీకరించనున్నారు. మిగిలిన రూ. 2,845 కోట్లను హెచ్‌ఎండీఏ (HMDA) లేదా టీజీఐఐసీ (TGIIC) నుంచి రుణం రూపంలో సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Musi River Project | జోన్ల వారీగా అభివృద్ధి పనులు..
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో కీలక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో జోన్-1ఏ కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 9.20 కిలోమీటర్ల మేర రూ. 3,104 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అలాగే, జోన్-1బీ పరిధిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ. 3,950 కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
Musi River Project | ఎంఆర్‌డీసీఎల్‌కు గ్రీన్ సిగ్నల్..
ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ’ని నియమించుకునేందుకు కూడా ఎంఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో మూసీ నది రూపురేఖలు మారి, హైదరాబాద్ నగరానికి కొత్త అందాలు రానున్నాయని అధికారులు భావిస్తున్నారు.
మూసీ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు
మొత్తం 21 కిలోమీటర్ల ప్రాధాన్య కారిడార్లలో రివర్‌ఫ్రంట్ పనులు
* హిమాయత్‌సాగర్ – బాపూఘాట్ (9.2 కి.మీ.)
* ఉస్మాన్‌సాగర్ – బాపూఘాట్ (11.8 కి.మీ.) అభివృద్ధిADB నుంచి రూ.4,500 కోట్లు.. HMDA/TGIIC నుంచి మిగతా రూ.2,845.12 కోట్లు… pic.twitter.com/4XCBjqFoQH
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 9, 2026
ఇది కూడా చదవండి: Fee Reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై క్లారిటీ..హైకోర్టులో ప్రభుత్వం కీలక హామీ