అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoist Narahari Surrender | సుదీర్ఘ కాలం పాటు అడవిని నమ్ముకుని, సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రముఖ మావోయిస్టు సీనియర్ నేత నరహరి జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గత 45 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక భూమిక పోషించిన నరహరి, ఆయన భార్య ధనమ్మ మంగళవారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఎదుట లొంగిపోయారు.
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.
Maoist Narahari Surrender | రూ.45 లక్షల చెక్కుల అందజేత
లొంగిపోయిన నరహరి దంపతులకు ప్రభుత్వం తరఫున డీజీపీ సీవీ ఆనంద్ భారీగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నరహరికి రూ.25 లక్షలు, ఆయన భార్య ధనమ్మకు రూ.20 లక్షలు.. మొత్తం రూ.45 లక్షల విలువైన పునరావాస చెక్కులను అందజేశారు.
సమాజంలో వారు గౌరవప్రదంగా కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు తెలంగాణ సర్కారు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా డీజీపీ భరోసా ఇచ్చారు.

Maoist Narahari Surrender | 822 మంది మావోయిస్టులు లొంగుబాటు
మీడియా సమావేశంలో డీజీపీ షాకింగ్ ఫిగర్స్‌ను వెల్లడించారు. తెలంగాణ పోలీసులు మావోయిస్టు నిర్మూలనలో, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో సాధించిన విజయాలను ఆయన వివరించారు.
2024 నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 822 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన సమయంలో మావోయిస్టుల నుంచి 334 అత్యాధునిక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాకు చెందిన మావోయిస్టులను తెలంగాణ రాష్ట్ర పోలీసులు చట్టపరమైన ప్రక్రియల అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు
అప్పగించారు.
Maoist Narahari Surrender | అజ్ఞాతంలోనే ఇంకా 47 మంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ స్పష్టం చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఇంకా ట్రేస్ కావాల్సి ఉందని పేర్కొన్నారు.
నేనే స్వయంగా కలుస్తా: డీజీపీ కీలక ప్రకటన
అడవుల్లో, అజ్ఞాతంలో ఉంటూ అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో సతమతమవుతున్న మిగతా మావోయిస్టులను తాను స్వయంగా కలుస్తానని డీజీపీ సీవీ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు.
తుపాకీ పట్టిన చేతులు విడిచి, శాంతి మార్గంలోకి రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. లొంగిపోయే మావోయిస్టులకు కొత్త జీవితాన్ని, మెరుగైన భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
నరహరి లాంటి అగ్రనేత సరెండర్ కావడంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!


