సినిమాEuphoria | 'యుఫోరియా': సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ‘యుఫోరియా’(Euphoria)– ఆధునికత వైపు సమాజం ఎంతలా పరుగెడుతోందో.. నైతిక, మానవీయ విలువలు అంతకంటే అంతకంటే వేగంగా పాతాళానికి పడిపోతున్నాయి. నేటి యువత ‘సుఖ భ్రమ’ (Euphoria) అనే మాయలో పడి తమ జీవితాలతోపాటు తమను నమ్ముకున్న కుటుంబాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా ‘యుఫోరియా’.

ఒక సామాజిక బాధ్యతతో దర్శకుడు గుణశేఖర్ తీసిన ఈ చిత్రం, నేటి తరం తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, యువతకు ఒక పాఠంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్​ అవుతున్న ఈ సినిమా విశేషంగా ఆదరణ పొందుతోంది.

ఈ చిత్ర కథాంశం 2022లో జూబ్లీ హిల్స్‌లో జరిగిన ఒక అమానవీయ కీచక ఘటన ఆధారంగా రూపొందించారు. పలుకుబడిగల కుటుంబాలకు చెందిన ఐదుగురు మైనర్లు 17 ఏళ్ల బాలికపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సినిమాకు ఆ ఘటనే ప్రధాన మూలంగా తెలుస్తోంది.

euphoriaEuphoria | ‘యుఫోరియా’- నటీనటుల ప్రతిభ..భావోద్వేగాల ప్రవాహం

యుఫోరియా‘ (Euphoria)సినిమాకు ప్రధాన బలం నటీనటుల అద్భుత నటన. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు జీవించారనే చెప్పాలి.

సారా అర్జున్ (హీరోయిన్): ‘నాన్న’ సినిమాలో చిన్నారిగా మెప్పించిన సారా అర్జున్ గుర్తుందా.. ఆ అమ్మాయే తెలుగులో ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. నటన ఆమెకు వారసత్వంగా అబ్బిన కళ అని ఈ మూవీ నిరూపిస్తుంది. ముఖ్యంగా ఆమె కళ్లు పలికించే హావభావాలు ఈ భ్రష్ట సమాజం మీద కత్తుల్లా దూస్తాయి.

కేవలం మాటలతో కాకుండా, మౌనంతో సమాజంలోని కుళ్లును నిలదీసే పాత్రలో సారా ఒదిగిపోయింది. తండ్రి నటుడు కావడం వల్లనో, చిన్ననాటి నుంచే కెమెరా ముందు ఉండటం వల్లనో కానీ, క్లిష్టమైన భావోద్వేగాలను ఈ యువతి చాలా పరిణతితో పండించింది.

భూమిక (తల్లి పాత్ర): బాధ్యత గల ఒక తల్లిగా, కొడుకు దారి తప్పుతుంటే తల్లడిల్లిపోయే పాత్రకు భూమిక ప్రాణం పోశారు. కొడుకు చేసే అరాచకాలకు సమాజం ఎదుట తలదించుకుంటూనే, అతడిని సరైన మార్గంలోకి తీసుకురావాలని తను పడే తాపత్రయం ప్రతి తల్లికి కనెక్ట్ అవుతుంది. తన కొడుకును మార్చే క్రమంలో ఆమె ఎదుర్కొనే అవమానాలు, సమాజం వేసే నిందలు గుండెను పట్టి పిండేస్తాయి.

విగ్నేష్ (వికాస్): కొత్త నటుడైనప్పటికీ విగ్నేష్ తన పాత్రలోని నెగటివ్ షేడ్స్‌ను, ఆ తర్వాత వచ్చే పశ్చాత్తాపాన్ని చక్కగా ప్రదర్శించాడు. మత్తుకు బానిసైన యువకుడిగా, క్రమశిక్షణ లేని అల్లరి చిల్లర కొడుకుగా అతని నటన ఎంతో సహజంగా ఉంది.

గౌతమ్ మీనన్: పోలీస్ ఆఫీసర్ పాత్రలో గౌతమ్​ గంభీరత సినిమాకు నిండుదనాన్ని ఇచ్చింది. వ్యవస్థలోని లొసుగులను, పోలీసుల పరిమితులను మీనన్​ పాత్ర ప్రతిబింబిస్తుంది. పిల్లల పెంపకంపై తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని సింపుల్​గా కఠినంగా తన మాటల్లో వర్ణించడం అద్భుతం.

Euphoria | తల్లిదండ్రుల గారాబం నిర్లక్ష్యం కావొద్దు..

నేటి కాలంలో పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల అతి గారాబం, బాధ్యతారాహిత్యమే అనేది నిర్వివాదాంశం.

భౌతిక సుఖాలు: పక్కన మరో పిల్లవాడికి ఖరీదైన బైక్​ ఉందనో, కారు ఉందనో.. తమ స్థాయికి మించి విలాసాలను పిల్లలకు సమకూర్చడం ప్రధాన తప్పిదం. రెక్కాడితే గానీ డొక్కాడని మధ్యతరగతి కుటుంబాల్లోనూ పిల్లల కోరికల కోసం అప్పులు చేసి మరీ వాహనాలు కొనిస్తున్నారు. వాటిపై యువత చేసే వీరంగం ఎందరో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోందనేది కాదనలేని నిజం.

పెంపకంలో లోపం: పిల్లలకు ఏం కావాలనేదానిపై శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులు.. వారు నిత్యం ఏం చేస్తున్నారు..? ఏమవుతున్నారనేది మాత్రం చూడటం లేదు. సంపాదన మీద ఉన్న శ్రద్ధ పిల్లల ప్రవర్తనను గమనించడం మీద ఉండటం లేదు. చిన్నతనం నుంచే “క్షమ” అనే గుణాన్ని, ఎదుటివారి పట్ల గౌరవాన్ని నేర్పకపోవడం వల్లనే యువకులు మృగాల్లా మారుతున్నారు. నేడు అమ్మాయిల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.

శిక్షలు – మార్పు: కేవలం జైలుకు పంపడం వల్లనో, కొట్టడం వల్లనో మార్పు రాదు. పిల్లలతో స్నేహంగా ఉంటూనే, తప్పు చేస్తే కచ్చితంగా మందలించే ధైర్యం కూడా తల్లిదండ్రులకు ఉండాలి.

Euphoria | యుఫోరియా – నిజ జీవిత ఘటనల నేపథ్యం..

హైదరాబాద్ వంటి నగరాల్లో ఇటీవల జరిగిన అనేక డ్రగ్స్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై, ముఖ్యంగా బాలికలపై జరిగిన దాడుల నేపథ్యానికి ఈ చిత్రం చాలా దగ్గరగా ఉంటుంది. పార్టీలు, పబ్బులు, డ్రగ్స్.. ఈ సంస్కృతి కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, గల్లీల్లోని మధ్యతరగతి యువతకు కూడా పాకిందనే చేదు నిజాన్ని ఈ మూవీ బయటపెట్టింది. చట్టాల కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు అనే ధీమా యువతలో పెరగడానికి పోలీసుల ఉదాసీనత, రాజకీయ ఒత్తిళ్లు కూడా ఒక కారణమని కథనం చెబుతోంది.

Euphoria | ‘యుఫోరియా’ – క్లైమాక్స్: మౌన విస్ఫోటనం

మూవీ మొత్తం ఒక ఎత్తయితే.. క్లైమాక్స్ మరొక ఎత్తు. దర్శకుడు గుణశేఖర్ తన మార్కును ఇక్కడ చక్కగా ప్రదర్శించారు. ఏ సినిమాలోనైనా డైలాగులతో ముగింపు పలుకుతారు. కానీ, ఇక్కడ మాత్రం భావోద్వేగాలే మాట్లాడతాయి.

తను చేసిన తప్పును తెలుసుకుని కొడుకు పశ్చాత్తాపపడుతుంటే ఆ తల్లి కళ్లలో కనిపించే ఆనందం వర్ణనాతీతం. సర్వం కోల్పోయినా.. క్షమాగుణం ఎంత గొప్పదో చాటిచెప్పే హీరోయిన్ చూపులకు ఈ ప్రపంచంలో దేనితోనూ విలువ కట్టలేం. ఈ దృశ్యాలు ప్రేక్షకుల గుండెను బరువుగా మారుస్తాయి.

EuphoriaEuphoria | ‘యుఫోరియా’ – సమాజానికి ఒక సందేశం

‘యుఫోరియా’ కేవలం వినోదం కోసం తీసిన చిత్రం కాదు. ఇది ఒక సామాజిక అవసరంగా చక్కని కోణంలో తీర్చిదిద్దారు. చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నప్పటికీ, వాస్తవ సమాజంలో ఇంతకంటే క్రూరమైన ఘటనలు నిత్య కృత్యంగా మారాయనేది జగమెరిగిన సత్యం.

ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ ఇది. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తుల కంటే, నేర్పే సంస్కారమే పిల్లలతోపాటు ఈ సమాజాన్ని రక్షిస్తుందని ఈ మూవీ చాటిచెప్పింది. సమాజం బాగుపడాలంటే, చట్టాల కంటే ముందు పొగరుబోతు మనుషుల్లో మార్పు రావాలి. ఆ మార్పునకు ఈ చిత్రం ఒక చిన్న విత్తనం లాంటిదని చెప్పొచ్చు.

ఈ చిత్రం కేవలం ‘ఏ’ గ్రేడ్ కంటెంట్ కోసమే కాదు.. సమాజంలోని ‘మురికి’ని కడిగి పారేయడానికి తీసిన ఒక ‘సర్జికల్ స్ట్రైక్’గా పేర్కొనవచ్చు. యువత ఒక్కసారి దారి తప్పితే వెనక్కి రావడం ఎంత కష్టమో.. వారి కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ సినిమా ఒక కరదీపికగా వర్ణించొచ్చు.

ఇది కూడా చదవండి..: Sreeleela Dating Rumors | శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ రూమర్లపై క్లారిటీ.. అస‌లు విష‌యం ఇది అంటూ స్వర్ణలత స్పందన

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...

Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం...

Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం...

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల...