Sreeleela Dating Rumors | శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ రూమర్లపై క్లారిటీ.. అస‌లు విష‌యం ఇది అంటూ స్వర్ణలత స్పందన

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sreeleela Dating Rumors | యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల, భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ రూమర్లు మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో ఈ అంశంపై శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పందించారు.

సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. స్వర్ణలత తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్‌తో పాటు చదువులపై కూడా ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ముఖ్యంగా ఆమె నీట్-పీజీ పరీక్షలకు సిద్ధమవుతోందని వెల్లడించారు. వ్యక్తిగత జీవితం, పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించేందుకు ఇంకా ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం ఉందని పేర్కొన్నారు.

Sreeleela Dating Rumors | అవ‌న్నీ పుకార్లే..

ఇలాంటి రూమర్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రచారంలో ఉన్న వార్తల్లో కొద్దిపాటి నిజం కూడా లేదని స్పష్టంచేశారు. అయితే ఇటీవల కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో దర్శనం చేసుకోగా, అదే సమయంలో తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో అక్కడ కనిపించడం చర్చనీయాంశమైంది. అప్పట్లో దానిని యాదృచ్ఛికంగా భావించినప్పటికీ, తర్వాత దానిపై పలు ఊహాగానాలు వినిపించాయి.

అలాగే ఐపీఎల్ సీజన్ సమయంలో కూడా ఈ వార్తలు మరింత వేగం పుంజుకున్నాయి. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మ్యాచ్‌లకు శ్రీలీల కుటుంబ సభ్యులు హాజరయ్యారని, కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కథనాలు ప్రచారం చేశారు. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడం కూడా చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వీటన్నింటినీ స్వర్ణలత పూర్తిగా కొట్టిపారేస్తూ, యాదృచ్ఛిక సంఘటనలను ఆధారంగా చేసుకుని ఊహాగానాలు సృష్టించవద్దని కోరారు.

Sreeleela Dating Rumors | వరుస సినిమాలతో బిజీ

ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా శ్రీలీలపై (Sreeleela) ఇలాంటి డేటింగ్ వార్తలు వచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలను కూడా అప్పట్లో ఖండించినట్లు తెలిపారు. తాను, కార్తిక్ తల్లి ఇద్దరూ గైనకాలజిస్టులమని, వృత్తిపరమైన పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని కథనాలు సృష్టించారని వివరించారు. ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉండగా, మరోవైపు తిలక్ వర్మ కూడా భారత జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్వర్ణలత ఇచ్చిన తాజా వివరణతో ఈ ప్రచారానికి ఎంతవరకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Telugu Film Chamber | ‘పర్సంటేజీ’ వివాద పరిష్కారానికి సురేష్ బాబు నేతృత్వంలో సబ్‌-కమిటీ ఏర్పాటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *