Peddi Collections | కలెక్షన్స్​లో దూసుకుపోతున్న ‘పెద్ది’​.. రెండు రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు..

మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన మూవీ ‘పెద్ది’ కలెక్షన్లలో దూసుకుపోతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​:  Peddi Collections | మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ నటించిన మూవీ ‘పెద్ది’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే రూ. 150 కోట్ల మార్కును దాటేసింది. ‘పెద్ది’ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Peddi Collections | రామ్ చరణ్ నటనపై ప్రశంసలు

ఈ స్పోర్ట్స్ డ్రామాకు అభిమానుల నుంచి సానుకూల స్పందన లభించింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లలోనూ కనిపిస్తోంది. ‘పెద్ది’ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును అధిగమించింది. ఇండస్ట్రీ ట్రాకర్ ‘Sacnilk’ ప్రకారం.. ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150.49 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు విదేశాల్లో ఈ చిత్రం రూ. 8 కోట్లు రాబట్టగా.. అక్కడి మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 36 కోట్లకు చేరాయి.

Peddi Collections | ‘పెద్ది’ బాక్సాఫీస్ వసూళ్లు

Peddi Collections

జూన్ 3న బుధవారం జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా ‘పెద్ది’ రూ. 18.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గురువారం తొలి రోజు రూ. 51 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం వసూళ్లు రూ. 69.50 కోట్లకు చేరాయి. అయితే, రెండో రోజు వసూళ్లలో దాదాపు 50 శాతం తగ్గుదల కనిపించింది. 10,113 షోల ద్వారా చిత్రం రూ. 26.90 కోట్లు వసూలు చేసింది. దీంతో భారతదేశంలో దీని మొత్తం నెట్ వసూళ్లు రూ. 96.40 కోట్లకు చేరాయి.

ఇది కూడా చదవండి..: Peddi Director Apology | క్షమాపణలు చెప్పిన ‘పెద్ది’ డైరెక్టర్​.. పలు సీన్ల తొలగింపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *