అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bharat Karth Accident | తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ నటుడు భరత్ కాంత్ (31), సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Bharat Karth Accident | నియంత్రణ కోల్పోయి..
అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీరిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Bharat Karth Accident | ‘టెనెంట్’ చిత్రంలో..
ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ (Tenant) చిత్రంలో భరత్ కాంత్ Bharat Karth కథానాయకుడిగా నటించి ప్రతిభను చాటుకున్నారు. అంతకుముందు పలు చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో భారత్ కాంత్ మరణం పరిశ్రమకు తీరని లోటు.
యువ సినిమాటోగ్రాఫర్‌గా త్రిలోక్ పలు చిత్రాలకు పనిచేస్తున్నారు. పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉన్న టెక్నీషియన్‌గా పేరుంది.
సినీ లోకం దిగ్భ్రాంతి
చిన్న వయసులోనే ప్రతిభావంతులైన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు గాఢ సానుభూతిని తెలియజేశారు. ‘తమ హీరో మరణ వార్త విని టెనెంట్’ చిత్ర బృందం శోకసంద్రంలో మునిగిపోయింది.
Work From Home | దేశ ప్రయోజనాల కోసం మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి రావాలి : ప్రధాని Modi పిలుపు

