అక్షరటుడే, వెబ్‌డెస్క్: Academy Awards AI Rules | ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన (ఆస్కార్) అకాడమీ అవార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సాంకేతిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై అకాడమీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం, పూర్తిగా ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను అవార్డుల పోటీలో అనుమతించరు. అసలు క్రియేటివిటీకి ప్రాధాన్యం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాడమీ స్పష్టం చేసింది. అయితే, చిత్ర నిర్మాణంలో పరిమిత స్థాయిలో ఏఐ వినియోగాన్ని పూర్తిగా నిషేధించలేదని స్పష్టం చేసింది.
Academy Awards AI Rules | నామినేషన్ ప్రక్రియలోనూ కీలక మార్పులు
ఇక నామినేషన్ ప్రక్రియలోనూ కీలక మార్పులు చేసింది. ఒకే దేశం నుంచి అనేక సినిమాలు పోటీలో పాల్గొనేలా అవకాశం కల్పించడంతో పాటు, ఒకే నటుడు పలు సినిమాలతో నామినేట్ అయ్యే అవకాశం సైతం కల్పించారు. దీంతో పోటీ మరింత విస్తృతం కానుంది.
ఈ కొత్త నిబంధనలు 2027లో నిర్వహించనున్న 99వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమల్లోకి వస్తాయి. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్స్‌కు కొత్త అవకాశాలు తీసుకురానున్నాయి. ముఖ్యంగా కొత్త ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగే అవకాశముందని వారు భావిస్తున్నారు.
Underwater National Flag | సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా

