The Paradise Movie | నానికి పోలీసుల షాక్​.. సినిమా చూసేందుకు అనుమతి నిరాకరణ

హీరో నానికి పోలీసులు షాక్​ ఇచ్చారు. ది ప్యారడైజ్ సినిమా చూసేందుకు అనుమతి నిరాకరించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : The Paradise Movie | హీరో నానికి పోలీసులు షాక్​ ఇచ్చారు. ది ప్యారడైజ్ సినిమా చూసేందుకు అనుమతించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్​ నాని నటించిన ది ప్యారడైజ్​ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి ప్రీమియర్​ షోలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో నేడు రాత్రి షో కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​రోడ్డులోని సంధ్య థియేటర్​లో అభిమానుల మధ్య కూర్చొని ప్రీమియర్​ షో చూసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని నాని సీఎం రేవంత్​రెడ్డి, పోలీసులను కోరారు. అయితే దీనిపై సీఎం స్పందిస్తూ.. పోలీసులు పరిశీలిస్తారని పేర్కొన్నారు.

The Paradise Movie | నిమజ్జనం నేపథ్యంలో..

నాని వినతిపై తాజాగా హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) స్పందించారు. గణేశ్​ నిమజ్జన నేపథ్యంలో అనుమతి లేదని తేల్చి చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా సంధ్య థియేటర్​లో సినిమా చూసేందుకు అనుమతి నిరాకరించారు. గతంలో ఇదే థియేటర్​లో పుష్ప–2 ప్రీమియర్​ షోకు హీరో అల్లు అర్జున్ రాగా.. తొక్కిసలాట చోటు చేసుకొని ఓ మహిళ మృతి చెందింది. పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు నానికి అనుమతి ఇవ్వలేదు.

దీనిని కూడా చదవండి : Ganesh Immersion Holiday | గణేశ్​ నిమజ్జనం.. 25న పాఠశాలలకు సెలవు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.