Lingamneni Sanjush | రోడ్డు ప్రమాదంలో యువతి మృతి కేసు.. డ్రగ్స్, మద్యం పరీక్షల్లో ఎంపీ కుమారుడికి నెగెటివ్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lingamneni Sanjush | హైదరాబాద్‌ Hyderabad నగరంలోని ఇనార్బిట్‌ మాల్‌ సమీపంలో ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 26 ఏళ్ల మహిళా ఉద్యోగిని భారతి ముఖి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్​కు చెందిన జనసేన నేత, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్‌ కుమారుడు లింగమనేని సంజుష్‌కు నిర్వహించిన డ్రగ్స్‌, డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షల్లో ప్రాథమికంగా నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ బాలానగర్‌ జోన్‌ డీసీపీ రితిరాజ్‌ తెలిపారు.

ప్రమాదం అనంతరం నిందితుడి రక్తం, మూత్ర నమూనాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి (ఎఫ్‌ఎస్‌ఎల్‌) పంపించారు. వాటిలో మద్యం, మాదకద్రవ్యాల ఆనవాళ్లు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు.

Lingamneni Sanjush | రోడ్డు దాటుతుండగా..

పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇనార్బిట్‌ మాల్‌లో సేల్స్‌వుమన్‌గా పనిచేస్తున్న భారతి ముఖి తన సహోద్యోగితో కలిసి భోజనం తీసుకురావడానికి ఐటీసీ కోహినూర్‌ వైపు వెళ్లారు.

తిరిగి వస్తుండగా మాల్‌ ఎదురుగా రోడ్డు దాటుతున్న భారతి ముఖిని వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?

ప్రమాదంపై అందిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కారును నడిపింది మాదాపూర్‌కు చెందిన 21 ఏళ్ల లింగమనేని సంజుష్‌గా గుర్తించారు.

అతడిని అదే రోజు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంజుష్‌ వ్యాపారవేత్త, జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్‌ కుమారుడిగా పోలీసులు పేర్కొన్నారు.

Lingamneni Sanjush | బీఎన్​ఎస్​ సెక్షన్​ 106(1) కింద కేసు నమోదు..

ప్రాథమిక పరీక్షల్లో మద్యం, డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించకపోవడంతో అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ సెక్షన్‌ కింద గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

అయితే ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో అరెస్టు అవసరాన్ని దర్యాప్తు అధికారి BNSS సెక్షన్‌ 35 నిబంధనల ప్రకారం పరిశీలించాల్సి ఉంటుంది.

అలాగే సుప్రీంకోర్టు అర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ తీర్పులో నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా పాటించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?

ఈ పరిస్థితుల్లో అరెస్టు అవసరం లేదని నిర్ణయించి నిందితుడికి నోటీసు జారీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *