Pellet Gun FIR | పెల్లెట్​ గన్​ వ్యవహారం.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు

ఢిల్లీలో విద్యార్థిపై పెల్లెట్​ గన్​ ఉపయోగించిన ఘటనలో పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pellet Gun FIR | ఢిల్లీ (Delhi)లో జంతర్​ మంతర్​ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో పెల్లెట్​ గన్​ ఉపయోగించిన వ్యవహారంపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. జూలై 20న పార్లమెంట్ వద్ద జరిగిన నిరసనలో పెల్లెట్ గన్ (pellet-gun) గాయాలకు గురైన 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ విషయంలో రాహుల్​ గాంధీ డీసీపీ ఆఫీసు () ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

రాహుల్​ గాంధీ బాధిత యువకుడితో కలిసి శుక్రవారం ఉదయం పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే, 30 రోజులు లేదా ఆరు నెలల పాటు పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేస్తానని పేర్కొన్నారు. ఆయన రోజంతా అక్కడ ధర్నా చేశారు. పోలీసులు సముదాయించిన వినలేదు. దీంతో పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Pellet Gun FIR | ఏడు గంటల తర్వాత..

రాహుల్​ గాంధీ (Pellet Gun FIR) మాట్లాడుతూ.. న్యాయం దిశగా ఇది మొదటి అడుగు అన్నారు. ఎఫ్​ఐఆర్​ నమోదు కావడానికి ఎంత సమయం పట్టిందో చూడాలన్నారు. పెల్లెట్లు ప్రయోగించి నెల రోజులైందని, అతని శరీరంలో ఇంకా పెల్లెట్లు ఉన్నాయన్నారు. తాము ఉదయం 11:30 గంటలకు వచ్చామని, దాదాపు ఏడు గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదైందని గాంధీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న పోలీస్ స్టేషన్​లోనే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామంలో, చిన్న పట్టణంలో ఉండే పోలీస్ స్టేషన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అని పేర్కొన్నారు.

 

 

దీనిని కూడా చదవండి : Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *