అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలో ఎంతో మంది పేదలు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే రెండో విడత ఇళ్లు మంజూరు చేసి ప్రోసిడింగ్స్ అందిస్తున్నారు. దీంతో మిగతా ప్రాంతాల్లో వారు తమకు ఎప్పుడు ఇళ్లు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) కీలక ప్రకటన చేశారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు. రెండో విడతలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సెప్టెంబర్ 15లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల (Jagtial) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అధికారులతో కలిసి ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు.
Indiramma Houses | అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఆధునిక వసతులతో కార్యాలయాలను నిర్మించి ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తామన్నారు.
Indiramma Houses | అర్హులకు ప్రాధాన్యం
సెప్టెంబర్ 15లోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. L1, L2, L3 వంటి సాంకేతిక వర్గీకరణల కంటే అర్హతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిజమైన పేదలకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా మిగిలిపోకుండా మరోసారి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.
దీనిని కూడా చదవండి: ACB Case | ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి