అక్షరటుడే వెబ్‌డెస్క్:Signal Free City|భాగ్యనగరాన్ని సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం రోడ్ల విస్తరణతోనే భవిష్యత్తు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావని భావిస్తున్న సర్కార్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘త్రీ-లెవల్’ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. శనివారం తెలంగాణ సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
ఏమిటీ ‘త్రీ-లెవల్’ మేనేజ్‌మెంట్?
నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా తొలగించేందుకు మూడు అంచెల్లో రవాణా వ్యవస్థను నిర్మించనున్నారు.
- అండర్‌పాస్‌లు: భూగర్భ మార్గాల ద్వారా వాహనాల రాకపోకలు.
- సర్ఫేస్ రోడ్లు: ఉపరితల స్థాయిలో సాధారణ ప్రయాణం.
- ఎలివేటెడ్ కారిడార్లు: రహదారుల పైభాగంలో నిర్మించే ఫ్లైఓవర్లు, కారిడార్లు.
Signal Free City|మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థ..
ట్రాఫిక్ నియంత్రణపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “రోడ్ల వెడల్పు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ , మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థలపై దృష్టి సారిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పూర్తిస్థాయిలో సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
Signal Free City|సచివాలయంలో పార్లమెంటరీ కమిటీ భేటీ..
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగర మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే రెండు మూడు దశాబ్దాల అవసరాలను గుర్తించి ఈ మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థను రూపొందిస్తున్నారు. తద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఇంధన పొదుపు , పర్యావరణ కాలుష్య నివారణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
“Underpasses below, roads at surface level, elevated corridors above” – Telangana govt plans a three-level traffic management model for Hyderabad.
• Govt aims to transform Hyderabad into a signal-free city.
• CM Revanth Reddy said road widening alone cannot solve future… pic.twitter.com/SrldjnFXu1
— Telugu360 (@Telugu360) May 9, 2026
ఇది కూడా చదవండి: West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

