Tamil Nadu Government | తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న అనిశ్చితి.. ఇంకా నిర్ణయం తీసుకోని వీసీకే పార్టీ..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu Government | తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే టీవీకే చీఫ్​ విజయ్(TVK Chief Vijay)​ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పలుమార్లు గవర్నర్​ను కలిశారు. అయితే మెజారిటీ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే (TVK) అధినేత కృషి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. వామపక్ష పార్టీలు మద్దతు తెలిపినా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం లేదు.

Tamil Nadu Government | కీలక ముందడుగు

రోజుల తరబడి జరిగిన తీవ్ర రాజకీయ సంప్రదింపుల అనంతరం.. వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే అధినేత విజయ్(Vijay Politics) శుక్రవారం మరో అడుగు ముందడుగు వేశారు. తాజాగా విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా తన మద్దతును సూచించింది.

Tamil Nadu Government | అధికారిక ప్రకటన చేయని వీసీకే

VCK నుంచి సానుకూల సంకేతాలు వెలువడినా.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. చెన్నైలో ఆ పార్టీ నేత బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ.. “విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. దీంతో ఆ పార్టీ ఏం చెబుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Saudi Job Scam|సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన.. ‘నన్ను కాపాడండి’ అంటూ సెల్ఫీ వీడియో వైరల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *