Telangana Beer Sales | తెలంగాణలో బీర్ల విక్రయాల జోరు.. ఎండలతో మందుబాబుల ‘చిల్’ మూడ్..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Beer Sales | రాష్ట్రంలో (Telangana) ఈ ఏడాది వేసవి తీవ్రత గత రెండు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతోంది. అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telangana Beer Sales | ఏప్రిల్​ నెలలో..

మరోవైపు ఈ ఎండలనే సాకుగా చూపుతూ మద్యం ప్రియులు చల్లటి బీర్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీర్ల అమ్మకాలు కొత్త రికార్డులను (beer demand) సృష్టిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 56.21 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ (excise revenue) గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 21 శాతం అధిక విక్రయాలు నమోదయ్యాయి. మరోవైపు ఈ నెలలో కేవలం 20 రోజుల్లోనే 40 లక్షల కేసుల బీర్లు విక్రయించబడినట్లు అధికారులు తెలిపారు.

Telangana Beer Sales | బీర్ల మార్కెట్‌కి భారీ ఊపు..

ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 24 లక్షలకు పైగా బీర్ బాటిళ్లు (Beer Bottles) అమ్ముడవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 10 నుంచి 12 లక్షల బాటిళ్ల విక్రయాలు జరుగుతుంటే, వేసవి ప్రభావంతో ఈ సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఈ ఏడాది జనవరిలో 34 లక్షల కేసులు, ఫిబ్రవరిలో 38 లక్షల కేసులు, మార్చిలో 50.78 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చిలో కేవలం 30.05 లక్షల కేసులు మాత్రమే విక్రయించగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే బీర్ల అమ్మకాలు దాదాపు 68 శాతం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

వేసవిలో డిమాండ్ పెరిగే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసిన ఎక్సైజ్ శాఖ, బీర్ ఉత్పత్తిని కూడా పెంచినట్లు తెలుస్తోంది. సాధారణంగా 15 రోజుల అవసరాలకు సరిపడా స్టాక్ ఉంచే అధికారులు, ఈసారి 35 రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు సిద్ధం చేశారు. దీంతో రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా స్టాక్ కొరత సమస్య కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ (Karim Nagar) వంటి ప్రధాన నగరాల్లో వీకెండ్ రోజుల్లో బీర్ల విక్రయాలు మరింత పెరిగినట్లు సమాచారం. అమ్మకాల పెరుగుదలతో ఎక్సైజ్ శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో శాఖకు రూ.3,272 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే కాలంలో అది రూ.3,618 కోట్లకు పెరిగింది. ఇక ఈ నెలలో కేవలం 20 రోజుల్లోనే రూ.1,895 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Ram Charan Bumrah Comment | బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్​చరణ్​.. ఎందుకో తెలుసా?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *