అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
మంత్రి పొన్నం రాష్ట్ర రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు.
Ponnam Prabhakar | దేశానికి వెన్నెముక
రైతే దేశానికి వెన్నెముక అని మంత్రి అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వివరించారు.
Ponnam Prabhakar | అధికారుల సూచనలు పాటించాలి

రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని మంత్రి సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి..: Idupu Kayitham Controversy 1 | ‘ఇడుపు కాయితం’ వివాదం అనవసరం.. సినిమాను సినిమాగానే చూడాలి: సీనియర్ నటుడు నరేశ్