Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలి : కవిత

సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Singareni Medical Board | తమ స్వేదాన్ని చిందిస్తూ.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భంలో బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆమె మంచిర్యాల జిల్లా (Mancherial District)లో మాట్లాడారు. కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం… సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతాయని స్పష్టం చేశారు.

Singareni Medical Board | కనీస వసతులు కరువు

Singareni Medical Board

తమ పార్టీ ఏప్రిల్ 25న ఏర్పాటు చేశామన్నారు. అప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సింగరేణి సమస్యలపై సైతం పోరాడటానికి బాయిబాట కార్యక్రమానికి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్​ కాస్ట్​తో పాటు అండర్​ గ్రౌండ్​ మైన్స్​ను కూడా నడిపించాలన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ వచ్చాక సింగరేణి కార్మికుల పరిస్థితి మారలేదన్నారు. కార్మికులను యాజమాన్యం నిర్లక్ష్యంగా చూస్తుందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు.

Singareni Medical Board | ఎండీవో వ్యవస్థ రద్దు చేయాలి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) రెండు రోజులు సింగరేణిలో పర్యటించారని కవిత అన్నారు. అయితే కార్మికుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాము అధికారంలోకి వచ్చాక మైన్స్​, మినరల్స్​ కోసం కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీవో సిస్టం రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలను తెలంగాణలో అమలు చేయొద్దన్నారు.

ఇది కూడా చదవండి..: Mahabubnagar Politics | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారు: కేటీఆర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *