CI Suspended | మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్​

మహిళపై వేధింపులకు పాల్పడిన జూబ్లీహిల్స్​ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సీపీ సజ్జనార్​ సస్పెండ్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CI Suspended | బాధితులకు అండగా నిలవాల్సిన ఓ పోలీస్​ అధికారి వేధింపులకు పాల్పడ్డాడు. న్యాయం కోసం ఠాణాకు వచ్చిన మహిళను మాయమాటలతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూయించి బ్లాక్​ మెయిల్​ చేశాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐని సస్పెండ్​ చేశారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డిని సీపీ సజ్జనార్​ (CP Sajjanar) మంగళవారం సాయంత్రం సస్పెండ్ చేశారు. కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఆయనమాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సహజీవనం చేసి గర్భం దాల్చిన తరువాత బెదిరించి అబార్షన్ చేయించాడు. రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి రూ.2 కోట్ల వరకు ఆమె నుంచి వసూలు చేశాడు. దీంతో బాధితురాలు డీజీపీ సీవీ ఆనంద్​కు ఫిర్యాదు చేశారు. సీఐకి డబ్బులు పంపిన ఆన్​లైన్​ ట్రాన్స్​క్షన్​ వివరాలను సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు.

CI Suspended | విచారణ చేపట్టి

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు సీఐపై విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్, ఆ మహిళ చాలా రోజుల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని, ఆ తర్వాత అతను ఆమెకు దూరమయ్యేందుకు పదేపదే ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు. ఆయన స్థానంలో రాజేంద్రనగర్​ ఎస్​హెచ్​వో ముత్తు యాదవ్​ను జూబ్లీహిల్స్​ సీఐగా నియమించారు.

ఇది కూడా చదవండి..: HYDRAA High Court | హైడ్రా చర్యలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం..రెండు కేసుల్లో కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *