అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Poker Raids | నిజామాబాద్(Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
Nizamabad Poker Raids | కార్పెంటర్ షాప్లో..
నగరంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని వర్నిచౌరస్తా వద్ద మహవీర్ కార్పెంటర్ షాప్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈక్రమంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1,560, మూడు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. అనంతరం నిందితులపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఐదో టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు.
Nizamabad Poker Raids | రూరల్ ఏరియాలో..
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న మొత్తం 21 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి పేకాటకు ఉపయోగించినకార్డులు, నగదు రూ.76,640/- 18 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ.49,480/- నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుండారం గ్రామంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ.18,560 నగదు, 8 సెల్‌ఫోన్లు, చక్రధర్ నగర్ తండా / గొల్లగుట్ట ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ.8,600/- నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ..