Nizamabad Rice Millers | తనిఖీల పేరుతో మిల్లర్లను వేధించొద్దు..

ధాన్యం ఎక్కువ కాలం మిల్లుల్లోనే ఉండిపోవడం వల్ల నిల్వ, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వివరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Rice Millers | నిజాయితీగా వ్యాపారం నిర్వహిస్తున్న రైస్ మిల్లర్లను తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్​ ధర్నా చౌక్‌లో శుక్రవారం మిల్లర్లు ఆందోళన చేపట్టారు.

Revanth Reddy Education | అందుకోసమే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రైస్ మిల్లింగ్ ప్రక్రియలో పెట్టుబడులు, విద్యుత్ బిల్లులు, హమాలీ చార్జీలు తదితర వ్యయాలు భారీగా పెరిగాయని తెలిపారు. ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మిల్లింగ్ చార్జీలను క్వింటాల్‌కు రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

మిల్లర్లకు చెల్లించాల్సిన మిల్లింగ్ చార్జీలు సుమారు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో అనేక మిల్లులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Nizamabad Rice Millers | మూడు నెలల్లోనే ధాన్యం సేకరణ పూర్తిచేయాలి

మిల్లులకు ధాన్యం కేటాయించిన తర్వాత మూడు నెలలలోపు బియ్యం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మిల్లర్లు కోరారు. ధాన్యం ఎక్కువ కాలం మిల్లుల్లోనే ఉండిపోవడం వల్ల నిల్వ, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వివరించారు.

కొత్త పంట ధాన్యాన్ని కేటాయించే ముందు బాయిల్డ్ రైస్ రేషియోకు సంబంధించిన అంశాలను స్పష్టంగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పచ్చి బియ్యం ఉత్పత్తి చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అలాంటి సందర్భాల్లో బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేశారు.

పంట నాణ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కేటాయింపులపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సార్టెక్స్ రిజెక్షన్స్, నూకల వల్ల కలిగే తరుగు నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కలు రూపొందించాలని కోరారు.

Nizamabad Rice Millers | ఒప్పందాల్లో ఇరుపక్షాల ప్రయోజనాలు ఉండాలి

మిల్లింగ్ ఒప్పందాలను మిల్లర్లు, ప్రభుత్వం రెండింటికీ అనుకూలంగా ఉండేలా రూపొందించాలని సంఘాల ప్రతినిధులు కోరారు. ధాన్యం రేషియోకు సంబంధించిన అంశాలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే తదుపరి పంటకు ధాన్యం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

1969 నాటి అఙ్ఞ ధాన్యానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, నిర్ణయించిన రేట్ల ఆధారంగా బిల్లింగ్ చేపట్టి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమకు రావాల్సిన మొత్తాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మిల్లర్ల భద్రతతో పాటు రైతుల ప్రయోజనాలు, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సంఘాల నాయకులు కోరారు. తమ డిమాండ్లపై సత్వర నిర్ణయం తీసుకోకపోతే మిల్లుల నిర్వహణ మరింత భారంగా మారే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *