అక్షరటుడే, లింగంపేట: JCB Accident | అదుపు తప్పిన ఓ జేసీబీ వాగులో పడిపోయింది. ఈ ఘటన లింగంపేట (Lingampet) మండలంలోని లింగంపేట కుర్దు వద్ద చోటు చేసుకుంది.
JCB Accident | పాముల వాగుపై నుంచి..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు వద్ద పాముల వాగు వంతెన నిర్మాణానికి శనివారం పనులు ప్రారంభించారు. పనులు చేపడుతున్న తరుణంలో ఆదివారం ప్రమాదవశత్తు జేసీబీ వంతెన పైనుంచి వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జేసీబీ డ్రైవర్‌కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలకు ఈ వంతెన వద్ద రాకపోకలు స్తంభించాయి. దీంతో అధికారులు తాజాగా పనులు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన విజయ్, త్రిష