Konda Murali | కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త, కొండా మురళి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Murali | కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త, కొండా మురళి స్పష్టం చేశారు. పదవులు వస్తుంటాయని, పోతుంటాయని.. కానీ తమ కుటుంబం రక్తంలో కృతజ్ఞతా భావం ఉంటుందని తేల్చిచెప్పారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.

Konda Murali | సారీ చెప్పనందుకే బర్తరఫ్..

తన భార్య సురేఖకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని కొండా మురళి తెలిపారు. కేవలం ఒకే ఒక్క మాట ‘సారీ’ చెప్పాలని అడిగారని.. అయితే తన పదవి ఉంటే ఉండనివ్వండి, పోతే పోనీ అనుకున్నారే తప్ప సురేఖ ఆ మాట చెప్పడానికి అంగీకరించలేదన్నారు. కొండా సురేఖను గెలిపించడంలో రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పాత్ర ఎంతో ఉందని గుర్తుచేశారు. మాట కోసం ఎంత దూరమైనా నిలబడతామని, పదవులు శాశ్వతం కాదని చెప్పారు. తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నప్పటికీ తాను బతికే ఉన్నానని, కొండా సురేఖ, తన మాట ఒకటేనని.. కానీ తమ బిడ్డ దారి మాత్రం వేరని క్లారిటీ ఇచ్చారు.

Konda Murali | కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కష్టాల నుంచి వచ్చిన నాయకులని కొండా మురళి కొనియాడారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తాము కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతామని చెప్పారు. గెలుపు సత్తా ఉన్న అభ్యర్థులకే తాము టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేస్తూ, పార్టీ క్యాడర్‌లో జోష్ నింపారు.

ఇది కూడా చదవండి:  Weapons Theft Case | ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. మాజీ హవిల్దార్ మల్లేశ్ కస్టడీకి కోర్టు అనుమతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *