Jenda Jatara | నగరంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన జెండా జాతర

నగరంలో జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: నగరంలో (Nizamabad) జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆస్థాన అర్చకులు జెండాకు ప్రత్యేక పూజలు  నిర్వహించారు.

Jenda Jatara | భక్తిశ్రద్ధలతో ఊరేగింపు..

ఘన చరిత్ర ఉన్న జెండాకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం భక్తులు.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జెండాను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. మేళతాళాల మధ్య జెండా గల్లీలోని జెండా బాలాజీ మందిరంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. 15రోజుల పాటు ఆలయంలో జెండా జాతర జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం 6 గంటల నుంచి ఆలయం తెరిచి ఉంటుందన్నారు. ఆలయ అర్చకులు నాగరాజు, ఈవో ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిచారు. జాతర ప్రారంభంమైన సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

Jenda Jatara | oighg

ఇది కూడా చదవండి: భారత్ మండపంలో అలరించిన ‘నవరస’ సాంస్కృతిక ప్రదర్శన

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *