అక్షరటుడే, వెబ్డెస్క్ : Arya Vaishyas Bhavan | హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్ భగాయత్ నగర్లో ఆర్యవైశ్య ఆత్మ గౌరవ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం ఉన్న వాళ్లని సీఎం అన్నారు.
ఆ సామాజిక వర్గంలో పేదవాళ్లు ఉన్నా.. ఆత్మాభిమానం కోసం జీవించారన్నారు. గ్రామాల్లో ఉండే ఆర్య వైశ్యులు ఎలాంటి ష్యూరిటీ లేకుండా పేదలకు అప్పులు ఇస్తారన్నారు. అన్ని వర్గాల ప్రజలతో వారికి సంబంధాలు ఉంటాయన్నారు. ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కలిసి ఉంటేనే బలం అని సూచించారు. సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. రాజకీయాల్లో వాటా కోసం పోరాడాలని, కలిసి కట్టుగా ఉంటేనే పదవులు వస్తాయని సీఎం అన్నారు.
Arya Vaishyas Bhavan | రోశయ్య విగ్రహం ఏర్పాటు చేశాం
ఆర్యవైశ్య బిడ్డ రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పని చేశారని గుర్తు చేశారు. 16 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు మారినా.. ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారన్నారు. ఆయన ప్రతిపైసాను ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారన్నారు. హైదరాబాద్ నగరంలో రోశయ్య విగ్రహం పెట్టామన్నారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగిన మహాత్మ గాంధీ ఆర్యవైశ్య బిడ్డని చెప్పారు. కాంగ్రెస్లో ఎంతోమంది ఆర్యవైశ్యులు కీలక పదవులు అనుభవించారని గుర్తు చేశారు.
దీనిని కూడా చదవండి : National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ విజయవంతం: సీపీ సాయిచైతన్య