అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA | హైడ్రా అధికారులు శనివారం భారీ ఆపరేషన్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.30 వేల కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
హైడ్రా ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేసింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 84 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది.
HYDRAA | కంటోన్మెంట్లో..
కంటోన్మెంట్ ప్రాంతంలో కల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మైనింగ్ కార్యకలాపాలతో పాటు.. వణ్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ కబ్జాదారుల ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamasbad) మండలం బహదూర్‌గూడ గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26 ప్రభుత్వ భూమిగా నమోదు అయి ఉంది. ఈ భూములను కాజేసే క్రమంలో పలువురు ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా కొందరు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. దీంతో హైడ్రా అధికారులు ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
దీనిని కూడా చదవండి : Lecturer Harassment | మహిళా లెక్చరర్‌పై ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వేధింపులు.. సంచలనం రేపిన ఘటన