అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ (Uppal) జంక్షన్ వద్ద నిర్మిస్తున్న గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) పనులను వేగవంతం చేయడానికి, కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు పైప్‌లైన్ పరిధిలో జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ హైవే వైపు రహదారి ఇప్పటికే మూసివేయబడిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి, ఫ్లైఓవర్ P15 ఫౌండేషన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ పనులు చేపడుతున్నారు.
పనుల నేపథ్యంలో జులై 27 ఉదయం 10 గంటల నుంచి 28న ఉదయం 10 గంటల వరకు కేడబ్ల్యూఎస్పీ ఫేజ్-2 రింగ్ మెయిన్-2పై 24 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి (HMWSSB) అధికారులు తెలిపారు.
Hyderabad Water Supply | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
ఫతేనగర్, హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, నాచారం, హెచ్ఎంటీ నగర్, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకటరెడ్డి నగర్, ఉప్పల్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికంగా), పద్మారావు నగర్, బన్సీలాల్‌పేట్,,బౌద్ధనగర్, తార్నాక (పాక్షికంగా), సీతాఫల్మండి, మెట్టుగూడ, లాలాపేట్ (పాక్షికంగా), నార్త్ లాలాగూడ, అడ్డగుట్ట, బాలానగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. పనులు పూర్తైన అనంతరం పైప్‌లైన్‌ను పునరుద్ధరించి, దశలవారీగా నీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : Kukatpally Accident | బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి