Rajnath Singh Warning | పాకిస్థాన్​కు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వార్నింగ్​

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాకిస్థాన్​కు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దుస్సాహసానికి, ఊహించని ప్రతిస్పందన తప్పదన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajnath Singh Warning | రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాకిస్థాన్ (Pakistan)​కు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దుస్సాహసానికి, ఊహించని ప్రతిస్పందన తప్పదన్నారు. లడఖ్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పాక్​ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని రాజ్​నాథ్​ సింగ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ సైన్యానికీ, మిలిటెంట్లకీ మధ్య ఎలాంటి తేడా లేదని విమర్​శించారు. భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తే, పాకిస్థాన్ తీవ్రవాద కేంద్రాలను సృష్టిస్తోందని ఆరోపించారు. తాము స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటే.. వారు ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ సెమీకండక్టర్లను తయారు చేస్తుంటే, వారు ఆత్మాహుతి బాంబులను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.

Rajnath Singh Warning | చర్చలు ఉండవు

పాక్​తో ఎలాంటి చర్చలు ఉండవని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు జరిగితే పీవోకే (POK)పై మాత్రం జరుగుతాయన్నారు. అధి భారత్​లో భాగమని స్పష్టం చేశారు. భారత్ ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధిపై దృష్టి సారిస్తుండగా, పాకిస్థాన్​ చొరబాటు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. ఏ సవాల్​నైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 1999 యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించిన సింగ్, వారి త్యాగాన్ని దేశం స్మరించుకుంటున్నప్పటికీ, ప్రాక్సీ యుద్ధం (పరోక్ష యుద్ధం), సరిహద్దు చొరబాట్ల వంటి నిరంతర ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

 

దీనిని కూడా చదవండి : Peddi Sudarshan Reddy | బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డికి తీవ్ర అస్వస్థత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *