అక్షరటుడే వెబ్‌డెస్క్: Prakash Raj SIR | ప్రముఖ నటుడు, రాజకీయ నేత ప్రకాష్ రాజ్ ఓటును ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా అధికారులు తొలగించారు. ఆయనపై ఇప్పటికే నాలుగు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో, బెంగళూరులోని ఆయన ఓటును ఎన్నికల సంఘం తొలగించింది. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సవరించిన ఓటర్ల జాబితా కర్ణాటకలో దాదాపు 65 లక్షల మంది ఓట్లు తొలగించారని, అందులో తన పేరు కూడా ఉందని , ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోందని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
Prakash Raj SIR | ఎన్నికల సంఘం తీరుపై మండిపాటు..
తాను అక్కడే పుట్టి పెరిగి, విద్యాభ్యాసంతో పాటు నాటక ప్రయాణం సాగించానని, అదే నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన ఓటు హక్కును తొలగించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఇలా ఓట్లు తొలగించి తమను ఆపలేరని, ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ మిమ్మల్ని అధికారం నుంచి దించడాన్ని ఎవరూ ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prakash Raj SIR | రాంచీలో అభ్యర్థులపై లాఠీచార్జ్..
మరోవైపు, ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని అసెంబ్లీ సమీపంలో నిరసన తెలుపుతున్న JPSC-JSSC అభ్యర్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. నిరసన ప్రాంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ రకమైన క్రూరత్వం ఇకపై చెల్లదని, ఇది అహంకారపూరిత అధికార పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. JPSC-JSSC రిఫార్మ్ మంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు నీటి ఫిరంగులు, లాఠీలతో అడ్డుకున్నారు. JSSC-CGL పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ ఆందోళన మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
Fraand 😂😂 you may chose n deny voting rights of few citizens who may not elect you back to thrown.. but can you stop us from eventually bringing you down from your thrown #justasking pic.twitter.com/S8BpM3CNy0
— Prakash Raj (@prakashraaj) August 11, 2026
ఇది కూడా చదవండి: Sriramsagar Project | ఎగువన తగ్గిన వర్షాలు.. శ్రీరాంసాగర్కు తగ్గుతున్న వరద..