అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Mechanic Death | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో బస్సు రిపేర్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మెకానిక్ మృతి చెందాడు.
RTC Mechanic Death | బ్రేక్ సమస్య రావడంతో..
జీడిమెట్ల డిపోలో బస్సు బ్రేకులను బాగుచేస్తుండగా, బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో 39 ఏళ్ల మెకానిక్ సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ సమస్య రావడంతో మెకానిక్ సంతోష్ కుమార్ మరమ్మతులు చేస్తున్నారు. ఆయన బస్సు కింద నుంచి బయటకు రాకముందే డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అది మెకానిక్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజ బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు