Telangana Heavy Rain | బిగ్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు

రాష్ట్రంలో వర్షాల కోసం వేచి చూస్తున్న ప్రజలకు మధ్యాహ్నం తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Heavy Rain | రాష్ట్రంలో వర్షాల కోసం వేచి చూస్తున్న ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మధ్యాహ్నం తర్వాత తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఈ క్రమంలో అధికారులు నగర ప్రజలు, వాహనదారులను అప్రమత్తం చేశారు.

Telangana Heavy Rain | తుఫాను మేఘాల విస్తరణ:

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒంటరి మేఘాలు ప్రస్తుతం తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను మేఘాలుగా మారుతున్నాయి. ఇవి అత్యంత వేగంగా విస్తరిస్తూ భారీ వర్షాలకు కారణం కానున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. వచ్చే రెండు గంటల్లో జనగామ, యాదాద్రి-భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ప్రారంభమై, క్రమంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ , కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది.

Telangana Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన..

నగరంలో ఎండల తీవ్రత పెరగడంతో, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వాయువ్య హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, మియాపూర్, ఆర్‌సీపురం, నిజాంపేటతో పాటు శంషాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అంచనా. సాయంత్రం, రాత్రి సమయాల్లో నగరవ్యాప్తంగా వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telangana Heavy Rain | ప్రయాణాల్లో జాగ్రత్త..

Telangana Heavy Rain

సాయంత్రం , రాత్రి వేళల్లో వాతావరణం అత్యంత క్రియాశీలంగా మారనున్న దృష్ట్యా, నగర ప్రజలు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో ఉరుములు, మెరుపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *