Fee Reimbursement | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల

రాష్ట్రంలోని ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fee Reimbursement | రాష్ట్రంలోని ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించేందుకు గాను, ప్రభుత్వం తాజాగా రూ. 100 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను అర్హులైన SC, ST, BC, మైనారిటీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

Fee Reimbursement | హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో..

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుపై ఇటీవల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బకాయిలను ఆగస్ట్ 15 నాటికి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిధులను విడుదల చేసింది. కోర్టు గడువు లోపే బాధ్యతలను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం తొలి విడతగా ఈ వంద కోట్ల రూపాయలను కేటాయించింది.

Fee Reimbursement | రేపటి నుంచే జమ..

Fee Reimbursement

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు సోమవారం (జూన్ 29) నుంచి నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో వేల మంది విద్యార్థులకు ఉపశమనం లభించనుంది.

ఇది కూడా చదవండి..: Telangana University | విద్యార్థులతో తెయూ చెలగాటం.. ఒకే రోజు నెట్–బీఈడీ పరీక్షలతో గందరగోళం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *