Yellareddy Municipality | మాట తప్పని కౌన్సిలర్​.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న సిద్ధి శ్రీధర్​ గుప్తా

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality | హామీలు ఇచ్చి మరిచిపోయి.. మభ్యపెట్టే ఈ రోజుల్లో.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ శభాష్​ అనిపించుకుంటున్నారు కౌన్సిలర్​ సిద్ధి శ్రీధర్​ గుప్తా. ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో 8వ వార్డు నుంచి స్వతంత్ర కౌన్సిలర్​గా గెలిచిన ఆయన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.

Yellareddy Municipality | ఎల్లారెడ్డి పట్టణంలో..

రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) సిద్ధి శ్రీధర్ గుప్తా ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం సొంత నిధులతో బోరుబావి తవ్వించారు. మున్సిపల్ ఎన్నికల్లో తన సొంత మ్యానిఫెస్టో ప్రకటించి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో సిద్ది శ్రీధర్ గుప్తా భారీ మెజారిటీతో విజయం సాధించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్(Congress), బీజేపీ(Bjp), బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులు గుప్త చేతిలో పరాజయం పాలయ్యారు. ఆడపిల్ల పెళ్లికి రూ.11వేలు ఇస్తానన్న హామీని నెరవేరుస్తూ.. వార్డుకు చెందిన ఇద్దరు పెళ్లి కూతుళ్లకు రూ.22వేలు అందించారు.

అలాగే ఆడబిడ్డ పుడితే రూ.10వేలు ఇస్తానని ప్రకటించి ఆ హామీని సైతం నెరవేర్చారు. ఫ్రీజర్ సైతం వార్డ్​లో ఏర్పాటు చేశారు. తన వార్డులోని ఉప్పర్ గల్లీలో(Yellareddy Town) నీటి ఎద్దడి తీర్చేందుకు సొంత నిధులతో బోరుబావి తవ్విస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఉప్పర్​గల్లీ వాసులకు రూ.వేలల్లో ఖర్చు చేసి బోరుబావి తవ్వించడంపై గల్లీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంతమందికే సాధ్యమని, అందులో సిద్ధి శ్రీధర్ గుప్తా వంటి వారు అరుదు అని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

22 2

33 2

ఇది కూడా చదవండి: CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *